Saturday, 12 September 2026 07:36:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాదరణతో గెలుపు తథ్యం... -పిల్లుట్ల రఘు

Date : 26 October 2023 06:36 AM Views : 511

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ల చెరువు : సింహం గుర్తు జోరుకి ప్రధాన పార్టీలన్నీ బేజారు... మేళ్ల చెరువు మండలంలో సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘుకు ప్రజలు ఘన స్వాగతం పలికినారు.ప్రతి అడుగు రఘు అన్న తోనే అంటూ, అడుగులో అడుగులు వేస్తూ సింహం గుర్తుకే మా ఓటు అంటున్న మేళ్ల చెరువు మండల వాసులు. గడప గడపకు రఘున్న భరోసా యాత్ర చేస్తున్న ప్రజలు,మహిళ లు పెద్దలు, యువకులు తమ ఓటు సింహం గుర్తు కే వేసి పిల్లుట్ల రఘున్న ఎమ్మెల్యేగా గెలిపించు కుంటామన్నారు.ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా మూడు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత పిల్లుట్ల రఘుకు చెందుతుందని వారు అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1500 మంది విద్యార్థులకు ఉచితంగా సొంత ఖర్చులతో హైదరాబాదు నందు ప్రయాణం,కోచింగ్, భోజన వసతి కల్పించిన ఘనత పిల్లుట్ల రఘు దే అని అన్నారు.మేళ్ల చెరువు లో ఆంజనేయ స్వామి విగ్రహంకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రంగులు వేయించిన ఘనత, మండలంలోని అనేక పాఠశాలలు బాగు చేపించి, దేవాలయాలను అధునికరించి బొడ్రాయిలు, విగ్ర ప్రతిష్టలు, అన్నదానాలు సొంతంగా నిర్మించిన ఘనత పిల్లుట్ల రఘు కి చెందుతుందని ప్రజలు అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయలేని పనులు కూడా చిరునవ్వుతో, గొప్ప పనులు చేశాడని ప్రజలు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బతుకులు మార్చుతా అని,మండల పరిధిలో ఎన్నో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి అయినా మన యువతకి ఉద్యోగాలు రాకుండా, సొంత పనులపై ఆధారపడి రోజు వారి కూలీలుగా మార్చి పనులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మార్చటానికి వచ్చిన వ్యక్తిని నేను అని ఒక్క అవకాశం ఇవ్వండి మేళ్లచెరువు మండలంతో పాటు నియోజకవర్గాన్ని అభివృధి చేస్తా అని పిల్లుట్ల రఘు అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రఘున్న అభిమానులు, సింహం గుర్తు ప్రచార మండలాల నాయకులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :