Wednesday, 29 July 2026 02:05:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం ...

Date : 15 September 2022 02:52 AM Views : 674

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.... ఏపీ కి ప్రధాన జీవనాడైన పోలవరాన్ని జగన్ సర్వ నాశనం చేశాడు . వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు నిల్...ప్రచారం ఫుల్. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ను వైసీపీ ప్రభుత్వం కొనసాగించాలి. వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలన తో ఎపి ప్రజలు విసిగిపోయారు. చంద్రన్న ముఖ్యమంత్రి అయితేనే ఏపీ అభివృద్ధి సాధ్యం. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కామెంట్స్. పుట్టపర్తి( ఓడి చెరువు) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తినియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలో ఈరోజు అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను టీడీపీ చేపట్టిందని దాన్ని ప్రభుత్వం కొనసాగించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు . పేదల ఆకలిని టీడీపీ తీరుస్తుంటే ఓర్చుకోలేని జగన్ ప్రభుత్వం ప్రజల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తూ దుర్మార్గపు చర్యకు పూనుకున్నాడని మాజీ మంత్రి పల్లె అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చేసింది నిల్ ప్రచారం మాత్రం ఫుల్ అని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. వైసిపి పాలనతో ప్రజలు బాగా విసిగిపోయారని పేర్కొన్నారు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడి పోవడం ఖాయం అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు పట్టం కట్టనున్నారని మాజీమంత్రి జోష్యం చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. చంద్రన్న సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రాక్షస పాలనకు చమర గీతం పాడాలని ప్రజలను కోరారు. పేద ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటే భవిష్యత్ లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజల పై దౌర్జన్యాలు ,భూ దందాలు, అక్రమాలు బాగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రజలు భయబ్రాంతులకు గురిచేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలే తిరగ బడే రోజులు వస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో అమాయక ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు ,దాడులను ఈ ప్రభుత్వం అలాగే సాగిస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధిత ప్రజల పక్షాన టీడీపీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ... మీ రాక్షస పాలనకు ఇకనైనా స్వస్తి పలకండి. మీ దౌర్జన్యాల పాలనతో బాగా విసిగిపోయారు. మీ అరాచకాలను ప్రజలు భరించలేక పోతున్నారని అన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అరాచక పాలనపై ప్రజలు ఓపిక పట్టారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హితవు పలికారు. మాజీమంత్రి తో పాటు పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు , ఓడి చెరువు మండల కన్వీనర్ జయచంద్ర ,మాజీ జడ్పిటిసి పిట్ట ఓబుల్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ రాజారెడ్డి , టీడీపీ నాయకులు పీట్ల సుధాకర్ , తుమ్మల మహాబుబ్ బాషా , జాకీర్, నిజాం , సర్పంచ్ శంకర్ రెడ్డి, అరిఫ్ , షాను , షబ్బీర్ , నాగరాజు తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , మహిళ నాయకురాళ్లు మస్తానమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :