Thursday, 30 July 2026 04:23:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాడ లేని అధికారుల తనిఖీలు..!

Date : 17 February 2024 09:20 AM Views : 245

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. పలు గ్రామాలలో కిరాణా దుకాణంలో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అమ్ముతూ కిరాణం షాపు ముసుగులో మద్యం సీసాలు అమ్ముతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మద్యం లభించడంతో వినియోగదారులు జేబులు ఖాళీ చేసుకొని అనారోగ్యం భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉండటంతో జల్సాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు మంచినీళ్లు దొరకని ఊళ్లు ఉంటాయేమో గాని మద్యం దొరకని గ్రామాలు లేవు అని తెలంగాణలో ఓ సామెత ఉంది. తాగినోళ్లకు తాగినంత బూర్గంపహాడ్ మండలంలో మద్యం దొరుకుతుంది.. ఏ బ్రాండ్లు కావాలన్నా. మద్యం షాపుల్లో దొరకకపోవచ్చు కాని బెల్ట్ షాపుల్లో ఇట్టే దొరికిపోతుంది. ఏ ఊరెళ్లినా పొద్దు మావు తేడా లేకుండా బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లెక్క వెలుస్తున్నాయ్. ఇదీ జగమెరిగిన సత్యం.. బూర్గంపహాడ్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులు తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు సమయం ఎంతైనా. మద్యం దొరుకును అనే తరహాలో అందుబాటులో ఉంటున్నాయి. మండల పరిధిలో గ్రామాలు ఉండగా పలు గ్రామాల మినహా మిగిలిన అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్టు షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని అతి చిన్న వయను పిల్లలకు పోస్తూన్నారు. రోజు రోజుకు గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కోన సాగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి మండల పరిధిలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని అలాగే బెల్ట్ షాపుల యజమానులకు మేము అండగా ఉన్నామంటూ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న సిండికేట్ వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :