సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ తల్లిపాలే భావితరానికి తరగని ఆస్తి అని, జీవిత పర్యంతం తల్లిపాల నుండే రోగ నిరోధక శక్తి పెంపొందించబడుతుందని సిడిపిఓ స్వర్ణలత లేనిన పేర్కొన్నారు. శనివారం రామవరం సత్యసాయిబాబా మందిరంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రు పాల ద్వారా బిడ్డ ఆరోగ్యానికి రక్షణ చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు .రామవరం సెక్టార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం 9,10,12 వార్డ్ ల కౌన్సిలర్లు మోరే రూప ,మునిగడప పద్మ, కూరపాటి విజయలక్ష్మి లు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్షా అందుకే పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారానే వారిలో ఎదుగుదల ఉంటుందని, తద్వారా ఆరోగ్య రక్షణ మెరుగుపడతాయని వారు అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సీతా, ,హెచ్ వి పద్మావతి,టీచర్స్ ఎన్ సరోజ, నీలవేణి ,భూక్య శ్రీదేవి షహనాస్ బేగం, కల్లూరి రజిత ,రమాదేవి, రాజకుమారి ,పద్మ ,ఈశ్వరి, రాధిక, వాణిశ్రీ ,ధనలక్ష్మి ,ఏఎన్ఎంలు రాజేశ్వరి, కవిత ,తార ,పద్మ ,ఆశా వర్కర్లు భవాని, అంగన్వాడి ఆయాలు మరియు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin