సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలుగు నాట సంక్షేమానికి నిలువెత్తు రూపం కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. శనివారం షాద్ నగర్ ముఖ్య కూడలిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదనీ అన్నారు. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడనీ కార్యకర్తలను కూడా నవ్వుతూ ఉండమనేవారనీ అన్నారు. సంక్షేమలో ఎన్టీఆర్ను మరిపించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు’ అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తన పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ‘వైఎస్సార్ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’ అని చెప్పారు. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్లు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ మెంబర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ సి ఐ మహిళా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎస్టీసెల్ బీసీ సెల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు ఎంపిటిసిలు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin