సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసిన చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు మరియు భూగర్భ శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి , శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ , పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి , కదిరి శాసనసభ్యులు పి.వి. సిద్ధారెడ్డి చౌళూరు రామకృష్ణా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దోషులు ఎవరైనా, ఎంతటివారైనా తప్పకుండా శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి స్వాగతం పలికి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ , పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దు గుంట శ్రీధర్ రెడ్డి , కదిరి శాసనసభ్యులు పి.వి. సిద్ధారెడ్డి.
-----------------------
Admin