సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు ఆదివారం నాడు మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన రావుల యాకయ్య కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన సుమారు 50 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతోమంది పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందుతున్నదని, వైద్యం చేయించుకొని ఆర్థిక సోమత లేని ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని వారన్నారు, ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి నుండి తమకు అందించిన ఆర్థిక సహాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...
-----------------------
Admin