సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీతోనే పట్టణంలో సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 19, 20, 21, వార్డులలో శనివారం బస్తి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఇప్పటికే రైతు, యూత్, భూమి డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని అన్నారు. వీటిలో రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతు లకు రూ.15 వేల పెట్టబడి, ఉపాధి హామీ పథకంలో ని రైతు కూలీలకు రూ.12 వేలు ఆర్థిక సాయం, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములు క్రయ విక్రయాలు చేసేలా హక్కులు కల్పించడం తో పాటు- అన్ని పంట లకు మద్ధతు ధర, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన రైతు కమిషన్ వంటివన్నీ డిక్లరేషన్లలో పొందుపరిచిందని పేర్కోన్నారు. అంతేగాక అమర వీరులకు రూ.25వేల పెన్షన్, 2లక్షల ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ, నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4వేల భృతి, యూత్ కమిషన్, రూ.10లక్షలు వడ్డీ లేని రుణా లు వంటివన్నీ ఇప్పటికే ప్రకటించిందనీ, దీంతో పాటు- మహిళా, మైనార్టీ, బీసీతో పాటు- మరిన్ని డిక్లరేషన్లను ఆ పార్టీ ఆగస్టు చివరి వరకు విడుదల చేయనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, మన్నె రవి, శబద్దీన్, నల్ల ముని శ్రీధర్, కొప్పాపురం ప్రవీణ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, గణేష్, మైనార్టీ సెల్ హలీం సాకీబ్, గంగ మూవీ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ ఖదీర్, ముబారక్, అందే శ్రీకాంత్, కిషోర్ యాదవ్, అహ్మద్ బాబా, హైదర్ గోరి, గణేష్ రాథోడ్, మాధవులు, అశోక్, నవీన్, అక్కి గారి శ్రీధర్, రుస్తుంగిరి, శేఖర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin