Tuesday, 15 September 2026 06:59:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకై ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం...

Date : 18 March 2023 12:24 AM Views : 573

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని, టౌన్ ప్లాన్ బిల్డింగ్ ఓవర్సీస్ (tpbo) మరియు టిఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన, నిర్వహించబోతున్న ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలు లీకు అయిన సందర్భంలో అన్నింటినీ తక్షణం రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించి దాని ప్రకారం పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30 లక్షల నిరుద్యోగుల తరఫున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భంలో వారిని పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది ఈ క్రమంలో వారు గృహనిర్బంధంలో సైతం ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. గ్రూప్-1 రద్దు కోరుతూ నిరుద్యోగుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును నిరసిస్తూ మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దద్దం చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కేవీ రమణ మాట్లాడుతూ నిరుద్యోగుల తరఫున వారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో టిఎస్పిఎస్సి కమిషన్ చైర్మన్ జనార్ధన్ పిఏ ప్రవీణ్ మరియు రాజశేఖర్ వెనుక ఉన్న పెద్ద పెద్ద తలకాయలను బయటకు లాగి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం కంటి తుడుపు చర్యలుగా సిట్ కమిటీని వేసి చేతులు దులుపుకుందని నిజనిర్ధారణ జరగాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలి అప్పుడు మాత్రమే అసలైన దోషులు బయటపడతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బూర్గంపాడు మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే.వి రమణ, జిల్లా మహిళా కన్వీనర్ పలక ఆదిలక్ష్మి, మండల మహిళ కన్వీనర్ కేసుపాక సాధన, కొప్పుల రాంబాబు, బొల్లు సంపత్, కేసుపాక రవి వర్మ, గొడ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: