సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజి మంత్రివర్యులు కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని . అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన తాజా మాజీ ఎమ్మెల్యే & మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ కొడంగల్ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గిరిజన రైతుల చేతికి బేడీలా లగచర్ల రైతుకు సంకెళ్ళు.. ఈ ప్రభుత్వం కు సిగ్గుoడాలి లగచర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం సాగర్ రోడ్డు రైతు బజార్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ కో-ఆప్షన్ మెంబర్ మోషన్ అలీ, మాజీ ఏఎంసీ ఛైర్మన్ లు ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,మట్టపల్లి సైదయ్య యాదవ్, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతిరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin