సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ ):సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ వార్డుల్లో ముందస్తుగా తక్షణ చర్యలు చేపట్టాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం పదో వార్డ్ లో పర్యటించి ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుండి కురిసిన వర్షాల కారణంగా నిల్వ ఉన్న మురికి నీటిలో దోమలు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెంది డెంగ్యూ ,మలేరియా, చికెన్ గున్యా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు. శుభ్రత లేని మంచినీళ్ల వల్ల వాంతులు ,విరోచనాలు మరియు విష జ్వరాల ప్రభలే ప్రమాదం ఉందని ,తక్షణమే యుద్ధ ప్రాతిపదికన విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు . అలాగే వార్డులోని అన్ని కాలువలను శుభ్రపరిచి దోమల మందు పిచికారి చేయాలని మురికిగుంటలు ఉన్న ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అలాగే దోమల పాగింగ్ చేసి విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలని అలాగే శుభ్రపరచిన కిన్నెరసాని మంచినీళ్లు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా చైతన్యమై ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని కొబ్బరి బోండాలు, చిప్పలు, టైర్లు, కూలర్లలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని తద్వారా మానారోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతామని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తునికి పాటి పరిపూర్ణ చారి ,ముద్దం మార్తమ్మ ,తునికి పాటి రత్నకుమారి ,ఎలిశమ్మ, చిలకలూరి సుప్రియ, ముంతాజ్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin