సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం వరంగల్ డివిజనల్ కార్యాలయం ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏసీపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు ఏ.ఎస్పీ శుభం పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు ఏసిపి కార్యాలయమునకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడం తో పాటు ఏసిపి స్థాయిలో డివిజన్ పరిధిలో దర్యాప్తు చేపట్టిన కేసుల వివరాలు ప్రస్తుత కేసుల స్థితిగతులు నిందితుల అరెస్టు ఎస్.టి ఎస్. ఎస్సి కేసుల స్థితి గతులపై సిపి ఏ.ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై సిపి ఆరా తీశారు ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా తో ఏసిపి కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Reporter