Wednesday, 29 July 2026 08:15:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శిలాఫలకం లేని సంకుస్థాపనలు ఎవరిని మోసం చేయడానికి...

Date : 05 September 2023 08:27 AM Views : 397

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేస్తున్న అతిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని... బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలోని 1వ వార్డులో ఆయన పర్యటించి శిలాఫలకం లేకుండా శంకుస్థాపన చేసిన దిమ్మెకు దండా వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే వనమా వ్యవహార శైలిని చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్లు ఉందని అన్నారు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకునే ఆయన ఎన్ని కోట్ల నిధులతో ఏమేం పనులు జరుగుతున్నాయో శిలాఫలకంలో పొందుపరచాల్సి ఉందని,ఇలా ఏ విధమైన సమాచారం లేకుండా నాలుగు రాళ్లతో దిమ్మెను కట్టి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయడం ఏంటని ప్రశ్నించారు? కొత్తగూడెంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి శిలాఫలకంలో కచ్చితంగా అందుకు తగ్గ సమాచారం ఉండాలని సూచించారు.ఇవేమీ లేకుండానే తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు.ఇలాంటి జిమ్మిక్కులను చూసి నమ్మి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు.నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి పనుల తాలూకు వివరాలను ఆయా ప్రాంతాలలో శిలాఫలకంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వనమా నియోజకవర్గాన్ని తన జాగీర్ అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటినుంచి ఎన్నికలు జరిగే వరకు ఎమ్మెల్యే వనమాను విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు.జరిగే ప్రతి అభివృద్ధి పనులు తాలూకు వివరాలను తెలుసుకొని పోరాటాలు చేస్తామని,తూతూ మంత్రంగా ప్రజలను మభ్య పెట్టేందుకు శంకుస్థాపనలు చేస్తూ డబ్బులు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,చెనిగారపు నిరంజన్ కుమార్,పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్,సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :