Sunday, 13 September 2026 11:21:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హత్ సే హాత్ యాత్రలో భాగస్వాములు కావాలి... -పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు

Date : 15 March 2023 12:17 AM Views : 806

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 16న ప్రారంభించనున్న హత్ సే హత్ యాత్రలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అఖిలభారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు సీఎల్పీ నేతగా ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గం బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమై ఖమ్మం జిల్లాలో ముగుస్తుందని 39 నియోజకవర్గాలలో 1365 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా మూడు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్ శివార్ తో పాటు, ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్ ఎజెండాగా మార్చుకొని ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తి మేరకు సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో కలిసి అడుగులో అడుగు వేయాలని పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.... అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపు గా సీఎల్పీ నేత, మధిర అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీ ఆర్ ఎస్ అరాచకాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టడానికి మన ఖమ్మం జిల్లా వాసికి దక్కడం చాలా సంతోషకరమన్నారు. భట్టి విక్రమార్క కి మద్దతుగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరారు. నీలో నిధులు నియామకాలు ఆత్మగౌరవం తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో భట్టి విక్రమార్క ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు దుదుకూరి వెంకటేశ్వర్లు,మలీదు వెంకటే శ్వర్లు,పల్లెబోయిన భారతీచంద్రం,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి,బానోత్ బాలాజీ నాయక్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :