సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ అదాలత్ అస్సంత భవన్‌లో ఏర్పాటు చేసిన అశోక చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “సమాజంలో అశ్రయాన్ని కోల్పోయిన చిన్నారులకు రక్షణ, విద్య, శ్రేయస్సు కల్పించడం ప్రతి ప్రభుత్వానికి ప్రజాసమాజానికి బాధ్యత. పిల్లలు దేశ భవిష్యత్తు. వారి అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుంది. ఈ కేంద్రం చిన్నారుల సంపూర్ణ అభివృద్ధికి దోహదపడాలి. అవసరమైన సహాయం అందించేందుకు నేను వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ ముందుంటాను” అని పేర్కొన్నారు అదేవిధంగా అధికారులు, సిబ్బంది పిల్లల సంక్షేమంపై పూర్తి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రమాకాంత్ రెడ్డి తో పాటు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter