సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : రాజీ మార్గమే రాజ మార్గమని దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడూ భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఉందని, వాటికి భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించ వద్దని తెలిపారు.లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా రాజీ పడి ప్రశాంత జీవనానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మైనంపల్లి స్థానిక సర్పంచ్ శ్రీను నాయక్,మైనంపల్లి ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్,ఉప సర్పంచ్ చిన్న నాయక్ గారు.న్యాయవాదులు ఉమ మహేష్,జగదీశ్వర్,రవి,కొర్ర రాంసింగ్ నాయక్,గణేష్,ఇద్దయ్య,వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రదనోపాధ్యాయులు మల్లీశ్వరి,స్థానికులు కిషన్ బావోజో,పాండు గన్న, జైలాల్, జబ్బార్,శివ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin