సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల పరిధిలోని లాలాపెట్, ఉమెంత్యాల్, రేగడి చిలకమర్రి, ముట్ట్పూర్, టేకులపల్లి గ్రామాలలో శుక్రవారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ఐదు గ్రామాల్లోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని, నెల రోజుల కార్యక్రమమైన మెడికల్ క్యాంపుల్లో ఈరోజు 2,600 మంది పైగా వైద్య శిబిరాల్లో పాలుపంచుకున్నారని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ఎంబిబిఎస్ డాక్టర్ల, ల్యాబ్ టెక్నీషియన్స్ అక్కడికక్కడే పరీక్షలు చేసి అవసరమున్న వాళ్ళకి ఉచితంగా మందులు అందిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కార్యక్రమం తర్వాత మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, లష్కర్ నాయక్, అంజన్న, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోయ అశోక్, చంద్రశేఖర్, కృష్ణ, ఆగమయ్య, రవి, గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin