సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాష్ట్రంలో ప్రజా పాలన అభాసుపాలైందని కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహాలతో ఉన్నారని బీఎస్పీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా లేకుండా పోయిందని ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక కారణం. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారు. రైతులకు బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి రూ. 19,746 కోట్లు పెట్టారు.వీటిలో జీతాలకే రూ. 3 వేల కోట్లు పోతాయి.మిగిలిన రూ. 16 వేల కోట్లతో రైతులకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు..? కోటి 50 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసాకే రూ. 22,500 కోట్లు కావాలి. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు.రూ. 2 లక్షల రుణమాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరం..కానీ బడ్జెట్‌లో పైసా కేటాయించలేదు.
-----------------------
Admin