సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మఠంపల్లి మండల కేంద్రము లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన మండల వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణలో అడవులు పచ్చదనం శాతం 24 మాత్రమే దీనిని తెలంగాణ భూభాగంలో 33% పెంచాలనే బృహత్ ప్రయత్నమే తెలంగాణ హరితహారం అని అన్నారు.పిల్లలకు పెద్దలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని వారు కోరారు.పాఠశాల స్థాయి విద్యార్థుల్లో అడవుల ప్రాధాన్యత పై అవగాహన కల్పించేందుకు అటవీ, విద్యా శాఖలు సమన్వయంతో మన దర్శిని కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు.అటవి సంపదను కాపాడేందుకు కూడా అటవీ శాఖ ప్రత్యేక హోదా తెలుస్తుంది అలాగే హరితహారం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈ ఏడాది అగ్రో ఫార్మసీ కింద గంధం, టేకు వెదురు, సరుగుడు ,మొక్కలు పంపిణీ చేయనుంది, ప్రభుత్వపరంగా ఈ అన్ని ప్రయత్నాలకు తోడు ప్రజలంతా తెలంగాణకు హరితహారం కోసం పాటుపడి మొక్కలు నాటడం సంరక్షించడం సమీప అటవీ ప్రాంతాల రక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించడం అడవికి హాని తలపెట్టే వారి సమాచారం సమీప అధికారులకు చేరవేయడం, ప్లాస్టిక్ వ్యర్ధాల కట్టడికి తోడ్పడటం పౌరులందరి బాధ్యత, అప్పుడే నిజమైన తెలంగాణకు హరితహారం కల సాకారమౌతుందని అని తెలిపారు. తొమ్మిదో విడత తెలంగాణ హరితహారం కార్యక్రమంలో ప్రజలను, భాగస్వామ్యం చేయాలని, ఉపాధి హామీ కూలీలను హరితహారం లో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. మసీదు, చర్చిలు, దేవాలయాలలో, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, స్పెషల్ ఆఫీసర్ ఏసీ సందీప్, ఎంపీ ఓ ఆంజనేయులు, ఏపీవో ఉమా, ఏపి ఎం సౌజన్య, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టిఏ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin