సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అనితరసాద్యూడు, అపర భగీరథుడు, నా అన్న వారి కోసం ఎంతకైనా తెగించే తత్వం పేద ప్రజల ఆశా జ్యోతి, యువతకు మార్గదర్శి, ప్రజా సేవకై జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) రాష్ట్ర కార్యదర్శి గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీను) జన్మదిన వేడుకలు జనసేన పార్టీ షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు రాజు నాయక్ అధ్యర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘనంగా జరిగాయి. అనంతరం భారీ బైక్ ర్యాలీ పట్టణం గుండా నిర్వహించి స్థానిక ముఖ్యకూడలి (చౌరస్తా) లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) జర్నలిస్ట్ మిత్రులు, పేపర్ శ్రీను అభిమానులు పెద్దఎత్తున పాల్గొని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దీవించారు.
-----------------------
Admin