సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్లపై రాష్ట్ర JAC ఇచ్చిన పిలుపు మేరకు కొత్తగూడెం MLA శ్రీ వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు ధర్నా నిర్వహించి,JAC నాయకత్వం సామూహిక రాయభారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్లను JAC చైర్మన్ ఎ.జె.రమేష్,AITUC జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్,సెక్రటరీ జనరల్ యూసఫ్, CITU జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి,గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి లు స్థానిక శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు కి వివరిస్తూ గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని,కార్మికుల అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కాదని,కనీస వేతనం 19 వేలు ఇవ్వాలని,ప్రమాద భీమా, పియఫ్,ఇయసై,పర్మినెంట్ తదితర 17 డిమాండ్ల పై రాష్ట్ర ప్రభుత్వానికి నెలన్నర క్రితమే తెలియజేసినప్పటికి,నేటి వరకు కనీస స్పందన లేదన్నారు.కరోనా లాంటి క్లిష్టమైన సందర్భం లో ప్రజల ప్రాణాలు కాపాడడం లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.ఇటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించకపొగా,పోటీ కార్మికులను తీసుకువచ్చి సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు తీవ్రంగా సమ్మె మొదటి రోజు నుండే అధికారులతో ప్రభుత్వం చేయిస్తుందని అన్నారు.తక్షణమే రాష్ట్ర JAC ని చర్చలకు పిలవాలని,ఇందుకు శాసన సభ్యులుగా ఉన్న మీరు చొరవ తీసుకోవాలని,పోటీ కార్మికులను నివారించే పని జిల్లా పంచాయతీ అధికారి తో మాట్లాడాలని కోరారు. ఇందుకు స్పందించిన యం.ఎల్.ఎ వనమా మాట్లాడుతూ కార్మికుల సమస్యలు చాలా న్యాయమని,సమస్యల పరిష్కారానికి మంత్రి తో మాట్లాడతానని హామీ ఇవ్వడమే కాక జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కి ఫోన్ చేసి సమ్మె ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయవద్దని,పోటీ కార్మికులను పెట్టీ వీరి పొట్ట కొట్టద్దని,పర్మినెంట్ వర్కర్ల తో తప్ప మిగతా వారిని తెచ్చి అసలు కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు అని తెలియ జేశారు.కార్మికుల కోసం అవసరమైతే సమ్మె టెంట్ లోకి వచ్చి కూర్చుంటానని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా JAC నాయకులు అమర్నాథ్,కిషోర్ కుమార్,జాడి సురేష్ కుమార్,వెంకన్న,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin