సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయానికి ఆకస్మిక తనిఖీ చేసిన డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి . విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఏ రోజు జనరేట్ అయ్యేటువంటి సర్వీసెస్ సంబంధించిన చలానా ఆ చలానాకు సంబంధించిన సర్వీసెస్ ని అన్ని నోట్ చేసి రికార్డు అప్డేట్ చేయవలసిందిగా ఆదేశించారు మరియు సచివాలయ సిబ్బంది డ్రెస్ కోడ్ మాండేటరీ అని డ్రెస్ కోడ్ వేసుకురాకపోతే వారి జీతాలను ఆపేయమని ఎంపీడీవో పోలప్పకు డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి పనులు 100% పూర్తి చేయాలని. ప్రస్తుతం ఇంటి పనులు 75% మాత్రమే అయ్యాయి మిగిలిన 25% మార్చి ఆఖరిలోగా పూర్తి చేయాలి ఎంపీడీవో పోలప్ప కు డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 1 సెక్రెటరీ ప్రకాష్, సచివాలయం 2 సెక్రెటరీ రామలింగారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin