సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలో జేకే హాస్పిటల్ లో ఒక మహిళా పేషెంట్ కి ఓ పాజిటివ్ రక్తం సర్జరీ నిమ్మితం అత్యవసరంగా కావాలి అని సత్యనారాయణ జనచైతన్య ట్రస్ట్ నిర్వాహకులు అయినా పి.వంశీ, పిల్లి.శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి. శివశంకర్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ పి.నర్సింహారావ్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి, రక్తదానం చేపించడం జరిగింది ఈ సందర్బంగా ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి.శివశంకర్ మాట్లాడుతూ .... మనిషికి జన్మనిచ్చేది అమ్మ అయితే పునర్జన్మించేది రక్తదాత, రక్తదానం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది రక్తదానం చేసిన నర్సింహారావ్ కి హృదయ పూర్వక అదేవిదంగా ప్రజలకు, యువతకు రక్తదానం చేయడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
-----------------------
Admin