Wednesday, 29 July 2026 12:19:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బారికేడ్లు ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలకు చెక్... - దండెం రాంరెడ్డి

Date : 28 July 2023 12:13 AM Views : 614

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం : ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమనిబంధనలు తప్పక పాటించాలని టీపీసీసీ కార్యదర్శి, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనీ రింగు రోడ్డు నుంచి గౌరెల్లీ గ్రామం ఎక్స్ రోడ్డు మీదుగా నాగోల్ కి వెళ్ళే రేడియల్ రోడ్డులో నిత్యం వేలమంది తిరగడంతో రోడ్డు రద్దీగా ఉండటంతో ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు పోతుండగా పలువురు గాయాలపాలవుతున్నారు. యాక్సిడెంట్స్‌ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. వాటికి కారణాలను తెలుసుకొని గ్రామ యువకులు, పెద్దలు ప్రమాదాల గురించి టీపీసీసీ కార్యదర్శి, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డిని కలిసి వారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వెంటనే స్పందించి తన సొంత నిధుల నుండి 1లక్ష రూపాయలతో బారికేడ్లు తెప్పించి గురువారం గౌరెల్లి చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది. అనంతరం దండెం రాం రెడ్డి మాట్లాడుతూ...ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉండాలని వారి క్షేమం కోరుతూ తన ప్రజల కోసం సొంత ఖర్చుతో 1లక్ష రూపాయలతో బారికేడ్లు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఒక సూచికగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ బారికేడ్లు ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.రోజు నియోజకవర్గంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం ఉన్న నేను ఉంటానని వారు తెలపడం జరిగింది.ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమనిబంధనలు తప్పక పాటించాలన్నారు.అతివేగం,సూచిక బోర్డులను గమనించకుండా,మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం ఉన్న ఆయన అండగా ఉంటానని తెలపారు. పోలీసులు కూడా రోడ్లపై అతివేగం, మద్యం తాగి నడిపే వారికి భారీ జరిమానా కూడా విధించాలి అలాగే సూచికలు జాగ్రత్తలు వాహనదారులకు తెలపాలి.ఈ కార్యక్రమంలో నల్లోల విట్టల్ కుమార్, గ్యార రాజు, నల్లోల బాలరాజు, గ్యారా బసవరాజు, గద్దం లింగయ్య, గాదె శేకర్, పత్తి రవికాంత్, వార్డ్ మెంబర్ కందల ఎల్లారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ మండల సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సౌండ్ శ్రీను, సురకంటి రాజశేఖర్ రెడ్డి, పండుగుల రాము, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి , భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి తీగరాజు నర్సింగ్, పండుగుల సత్యనారాయణ, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ కాంటేకర్ రాహుల్, ఉసిగారి మధు, యంజాల రాంబాబు, తారామతి పేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నల్లంగల్ల అరవింద్, కడియాల చింటు (సాయి), గడ్డం శివకృష్ణ, గడ్డం శివకుమార్ , కోరని భరత్, గుడ్డి ఈశ్వర్, గుడ్డి మధుకర్, అల్వాల రోహిత్, కట్టెల బలశేంకర్, మబ్బు వెంకట్, గడ్డం శివరాజ్, గడ్డం జగదీష్, నితిన్, పరంద ఓంకార్, నల్లంగల్ల సాయితేజ, నల్లంగల్ల హరివర్దన్, అమీన్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: