సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : యువత మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలని కోదాడ డిఎస్పీ ప్రకాష్ అన్నారు . హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ పరిదిలోని 5 పోలీసు స్టేషన్ల పరిధిలోని గంజాయి అక్రమ రవాణా, గంజాయి వినియోగించే వారి కి కౌన్సిలింగ్ చేశారు . మత్తు పదార్ధాలకు అలవాటు పడి యువత చెడు మార్గాలలో వెళ్లకుండా ఉండాలని చదువు ,ఉద్యోగాల పై దృట్టిపెట్టి జీవితం లో సెటిల్ అవడానికి ప్రయత్నించాలని కోరారు .మత్తు పదార్ధాలు వినియోగం , అక్రమ రవాణా సంభందిత నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారి పై కటిన చర్యలు తీసుకొనున్నట్లు డిఎస్పీ హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సిఐ రామలింగారెడ్డి , ఎస్ ఐ లు హరికృష్ణ , వెంకటరెడ్డి , బాలకృష్ణ, పరమేష్ ,లింగయ్య ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
-----------------------
Admin