సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ / సమాజంలో తాము సంపాదించిన ధనంలో కొంత పేద ప్రజలకు పంచడం సామాజిక సేవలకు ప్రాధాన్యత కల్పించడం కొంతమందికే చెల్లుతుంది.. తల్లిదండ్రులు చూపిన మంచి మార్గాన్ని అనుసరించి వారి బాటలోనే సేవలను కొనసాగిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు ఓ యువకుడు. ఫరూఖ్ నగర్ మండలంలోని పీర్లగూడ గ్రామానికి చెందిన బాబాగోరి ప్రతి యేడాది గ్రామ ప్రభుత్వ పాఠశాలలొ నిరుపేద విద్యార్థులకు 50 మందికి స్కూల్ బుక్స్, బ్యాగ్స్, షూస్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ 2023 విద్యా సంవత్సరానికి గాను మంగళవారం గ్రామ సర్పంచ్ ముబీన్ గోరి, గ్రామ నేత బుద్ధుల జంగయ్య, డిప్యూటీ సర్పంచ్ గుంటి రమేష్ తదితరుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బుక్స్ బ్యాక్స్ షూస్ అందజేశారు. బాబా గోరి తండ్రి వహబుద్దిన్ గోరి ఇదే గ్రామానికి గత 27 ఏళ్ల పాటు ఉప సర్పంచ్ గా సేవలు అందించిన ఘనత ఉంది. ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలను స్వతహాగా చేపట్టేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన మార్గంలోనే ప్రతి ఏటా విద్యార్థులకు బుక్స్ బ్యాగ్స్ షూస్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నిరంతరం ఈ కార్యక్రమాన్ని ప్రతిఏట ఇలాగే కొనసాగిస్తానని బాబాగోరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముబీన్ గోరి మాట్లాడుతూ.. అప్పుడే సమాజంలో ఐక్యమత్యం ఉంటుందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉన్న నాడే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని గోరి అన్నారు. ఈ సందర్భంగా బాబాగోరిని పూలమాల శాలువాతో ఘనంగా వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జంగయ్య, సాయిలు, మణి గౌడ్, లియాకత్ గొరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin