Thursday, 30 July 2026 03:35:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఇంటి స్థలాం లేదా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి...

Date : 24 March 2024 06:50 AM Views : 295

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలిరాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి,రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ఎటువంటి వేతనాలు లేకుండా 24 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ఇంతే కాకుండా ప్రతి జర్నలిస్టుకు ప్రతిరోజు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇచ్చే విధంగా ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ప్రతి జర్నలిస్టు ఇంటికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు నిలువ నీడ లేని పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత మార్కెట్ యార్డు లో గల మిర్చి యార్డులో 500 గజాల స్థలం కేటాయించి అన్ని రకాల సౌకర్యాలతో జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని కోరారు.అనంతరం టి యు డబ్ల్యు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం రోడ్డు లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మద్దతును ప్రకటించారు. కార్యక్రమం లో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలయ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకల చిరంజీవి సూర్యాపేట నియోజకవర్గం పట్టణ కమిటీ సభ్యులు తప్సి అనిల్ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :