Saturday, 12 September 2026 05:58:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఆర్ఎస్ నేతలు శవరాజకీయాలు మానుకోవాలి

Date : 20 August 2026 12:13 AM Views : 196

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి :బీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేట బంద్‌కు పిలుపు నివ్వడంపై నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బుధవారం దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ ధ్వజమెత్తారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రుడిగా,దివంగత మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డిగా చెప్పుకుని తిరిగే బీఆర్‌ఎస్ నాయకులు గుండెపోటుతో మరణించిన మీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసి,తెలంగాణ భవన్‌కు పెద్ది సుదర్శన్ రెడ్డి భవన్‌గా నామకరణం చేసుకోవాలని అన్నారు.అంతేగానీ నర్సంపేటలో శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.ఇటువంటి శవ రాజకీయాలు చేస్తూ తమ నాయకుడు నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవ రెడ్డి ని బద్నాం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం తన పని తాను చూసుకుంటూ పోతుందని, చట్టం ఎవరికి చుట్టం కాదని తన పని తాను చేసుకుంటూ పోతుందని, చట్టానికి ఎవరైనా తలవంచి పనిచేయాల్సిందేనని అన్నారు. ప్రశాంతమైన నర్సంపేట గడ్డపై శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కక్ష సాధింపు,కవ్వింపు రాజకీయాలు చేయాలని చూస్తున్నది బీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు.కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారు కాబట్టి బీఆర్‌ఎస్ నాయకులు ఇన్ని శవ రాజకీయాలు చేస్తున్నా సహనంతో ఉంటున్నారని, ఇప్పటికైనా తమ వ్యవహారశైలిని మార్చుకోకుంటే కాంగ్రెస్ నాయకులు తమ సమయం ను విడాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరగకూడదనే అంకిత భావంతో పనిచేస్తోందని,ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం వెంటనే గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి నిమిషాల వ్యవధిలో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించడం వాస్తవం కాదా! అని ప్రశ్నించారు.ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన అనంతరం రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారికంగా పోలీస్ లాంఛనాలతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించిన విషయం బీఆర్‌ఎస్ నాయకులకు కనిపించలేదా అని పేర్కొన్నారు.ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకులు కనువిప్పు చేసుకొని శవ రాజకీయాలు,విగ్రహ రాజకీయాలు మానుకోవాలని చుక్క రమేష్ సూచించారు లేకుంటే మండలంలో చర్యకు ప్రతి చర్యకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ హెచ్చరించారు . నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి దేవాదుల ద్వారా 200 కోట్ల నిధులు పనులు దేవాదుల ద్వారా రంగాయి చెరువు రిజర్వాయర్ గా మారిస్తే ,నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, చెన్నారావుపేట మండలాల రైతులకు సాగునీటి త్రాగునీటి సమస్య ఉండదని జరుగుతున్న పనులను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని,ప్రజలు, రైతుల దృష్టిలో తమ నాయకుడిపై దుష్ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, ప్రాథమిక సహకార సంఘం మహ్మదాపురం చైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు, ప్రాథమిక సహకార సంఘం నాచినపల్లి చెన్నూరి కిరణ్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం దుగ్గొండి చైర్మన్ ముత్యాల కుమారస్వామి, దుగ్గొండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగరావు, మండల నాయకులు బూర హేమచందర్ గౌడ్, ఉత్తరేణి రాజబాబు, పొగాకు వెంకటేశ్వర్లు, బండారి ప్రకాష్, అమ్మ రోహిత్, డ్యాగం శివాజీ, ప్రశాంత్, బొమ్మెన శ్రీశైలం, అసోలా సురేష్, ఉత్తరేణి శోభన్ బాబు, కందికొండ రఘు, పిండి అశోక్, క్లస్టర్ ఇన్చార్జులు, దుగ్గొండి మండలం సర్పంచులు సుకినే నాగరాజు, రాస చేరాలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: