సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో విశ్రాంత ఉద్యోగుల భవనం వద్ద రెండో విడత కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ దుబ్బాల లక్ష్మీ కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన ఏ పథకం ప్రారంభించిన విజయవంతం అవుతుందని అన్నారు . ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కంటి వెలుగు కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే సీఎం కేసీఆర్ చేపట్టే ప్రతి పథకం ఆదర్శంగా నిలిచి చారిత్రాత్మకం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమర్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin