సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : రాష్ట్ర కార్మిక శాఖ సౌజన్యంతో సి ఎస్ సి హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్ జెల్లా. తారక్ ఆధ్వర్యంలో క్యాంపు కోఆర్డినేటర్స్ ఎం శ్రీనివాస్, బి రాకేష్ మరియు సిబ్బందిచే భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షతన హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా, ఆర్.ఎం.పి పి.ఎం.పి నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్కే మన్సూర్ అలీ లు మాట్లాడుతూ భువన నిర్మాణ కార్మిక సంఘం నుండి లేబర్ కార్డు పొందిన కార్మికులందరూ ఉచితంగా 100 కి పైగా టెస్టులు ఉచితంగా చేసుకోవచ్చన్నారు. షుగర్, కిడ్నీ లివర్, బ్లడ్ గ్రూపింగ్,ఎలర్జీ,గుండె పరీక్ష, థైరాయిడ్,మలమూత్ర, వినికిడి పరీక్ష వంటి పరీక్షలు ఎన్నో చేసుకొని వైద్య సహాయం పొందవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని లేబర్ కార్డు కలిగిన కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేబర్ కార్డు పోగొట్టుకొని ఉన్న కార్మికులకు కూడా వైద్య సేవలు పొందవచ్చు అన్నారు. అలాగే లేబర్ కార్డు ఇన్సూరెన్స్ రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 300 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు బంక శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినాయకరావు, బి ఎల్లయ్య, పల్లపు వెంకటేశ్వర్లు, మన్నెం,సైదులు, నరేష్, వైద్య టెక్నీషియన్ సిబ్బంది ప్రశాంత్,భరత్, జి నవీన్, డి వినయ్, జె.నవీన్, కార్తీక్, గణేష్ రవి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin