సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండల పరిధిలోని వెలకమాకులపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి. వెలగమాకులపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. బెంగళూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్. గోరంట్ల మండలం గుమ్మయగారి పల్లి కి చెందిన ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంలో సోమందేపల్లి వైపు వస్తూ ఉండగా ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. మృతులు గుమ్మయ్య గారి పల్లికి చెందిన ఎర్రి స్వామి ఆచారి వయస్సు 48... భార్య వరలక్ష్మి వయసు 38 ఇద్దరు దంపతులు ఈరోజు శనివారం కావడంతో పావగడ శనేశ్వర స్వామి వారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది....
-----------------------
Admin