సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం గుర్రంబోడు గ్రామనికి చెందిన మూడవత్ వినోద్ ఇటీవల కాలంలో ట్రాక్టర్ నడుపుతూ బోల్తా పడి మరణించడం జరిగింది విషయం తెలిసిన రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి రఘు అన్న చేయూత ద్వార 5000/-రూపాయలు ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది . నిరుపేద కుటుంబాలకు రఘు అన్న చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు. కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో ఉన్న యువత డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానంగా నడపాలి సలహాలు సూచనలు పాటించాలి మన మీద మన కుటుంబ సభ్యులు అదారపడి ఉన్నారని తెలియజేశారు....
-----------------------
Admin