సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపినాయకులు, కార్యకర్తలు గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముత్తన్న, పండరి, హర్ష, వినోద్, రవి స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin