సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రధాన మంత్రి సురక్షిత మాతృ వందన అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం భోజన వసతి గత సంవత్సరoగా కదిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు పృద్వి, రంజిత్ రాజు, వారిఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసినారు, ఈ సందర్భంగా ప్రాథమికఆరోగ్య లో భాగం గా డాక్టర్ వి. కమల్ రోహిత్ తగు సూచనలు, సలహాలు ఇస్తూ పౌష్టికహారం అవసరం, ప్రాముఖ్యత, పౌష్టికాహర విలువల ఆహార గుర్తింపు, వాడకం, రక్త హీనత నష్టాలు, ఆసుపత్రి సురక్షిత కాన్పు, ప్రభుత్వ పథకాలు, ప్రోత్సకాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.43 మంది గర్భవతులు వైద్య పరీక్షలు చేయగా 13 మంది కి హై రిస్క్ గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందచేస్తూ మిగిలిన వారందరికీ అవసర పరీక్షలు, చికిత్స, ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. 13 మంది గర్భవతులకు ఉచిత స్కానింగ్ కొరకు సిఫార్సు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎం పి హెచ్ ఈ ఓ గఫూర్, పి హెచ్ ఎన్ దిల్షాద్, ఎం పి హెచ్ ఎస్, విజయ్ కుమారి, మురళీధరన్, ఫారంసిస్టర్ వరలక్ష్మి, ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు,గర్భవతులు, ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు.
-----------------------
Admin