Wednesday, 29 July 2026 05:22:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మక్తల్ మండలంలోని కర్ని ఊరూరా చెరువుల పండగ వేడుకల్లో పాల్గొన్న సంబంధిత శాఖల అధికారులు...

Date : 09 June 2023 08:21 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు చెరువుల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ EAO జానసిన్ సుజాతన్ మాట్లాడుతూ... ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు సమయం నుండే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన కాలేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పెరగడంతో కనివిని ఎరుగని రీతిలో పంట దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యము ఉత్పత్తిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, నేడు మన రాష్ట్ర వ్యవసాయ విధానం, ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. గతంలో చెరువుల మరమ్మత్తుల కోసం ఏళ్ల తరబడి నాయకుల చుట్టూ కార్యాలయం చుట్టూ తిరిగేదని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రానున్న కాలంలో రైతులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అందుతాయని వివరించారు. ప్రతి ఊరికి స్మశాన వాటిక, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎంపీడీఓ శ్రీధర్, ఎం పీ ఓ పావని, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, విఆర్ఏ ఆంజనేయులు ఆశావర్కర్లు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :