సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ జిల్లా ఎస్ ఈ ఆర్ పి డి పి ఎం అరుణ్ కుమార్ ,ఈ సందర్భంగా పాఠశాలలో మరియు కళాశాలలో బాలికల ఆరోగ్య మరియు పరిశుభ్రత (హెల్త్&హైజిన్) మీద నియోజకవర్గము లోని పాఠశాలలు మరియు కళాశాలలో చేపట్టవలసిన అవశ్యక చర్యల గురించి వివరించారు. డి పి ఎం వివరించిన అంశాల మీద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వెంటనే స్పందిస్తూ అతి త్వరలో ఆయా అంశాలను అమలులోకి తెస్తాం అని ,ఈ అంశం మీద వెంటనే పనిని ప్రారంభించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమము లో హుజూర్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్ షర్మిల క పాల్గొన్నారు.
-----------------------
Admin