సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కేంద్ర న్యాయశాఖ, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ను నిర్వహించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది జిల్లా కోర్ట్ ఆవరణలో ఉన్న చెత్త, రాళ్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఏం.శ్యామ్ శ్రీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, మొదటి అదనపు జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సుచరిత, డిప్యూటి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, న్యాయవాది మెండు రాజమల్లు, న్యాయశాఖ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, దీకొండ రవికుమార్,లగడపాటి సురేష్,మల్లికార్జున్, మీనా కుమారి, జి ప్రమీల, కృష్ణకుమారి, న్యాయశాఖ ఉద్యోగస్తులు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.
-----------------------
Admin