Wednesday, 29 July 2026 04:17:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం లక్ష్యం... -ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 09 June 2023 08:06 AM Views : 701

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మఠంపల్లి మండలం గుర్రంపొడు గ్రామంలో ఎంపీపీ పార్వతి కొండా నాయక్ నిర్వహించిన చెరువులు ,సాగునీటి దినోత్సవం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరి కూడా తెలుసు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాగునీరు లేక కరెంటు లేక వ్యవసాయం చేసే పరిస్థితి లేక అనేక మందికి భూములు జాగాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో నీళ్లు, కరెంట్ లేక వలసలు పోయిన పరిస్థితి, ఈ భూమి జాగలకు నమ్ముకుంటే బతుకడం కష్టం అని, ఇతర రాష్ట్రాల కు దేశాలకు బతుకు తెరువు కోసం పోదామని, ఒక్కొక్కరు ఊరు నుండి వందల కుటుంబాలు వలసలు పోయిన పరిస్థితిలో బలవంతంగా వ్యవసాయం చేసి పంట చేతికి రాక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాటువంటి పరిస్థితి నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసుకున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఈ రోజు ఏ గ్రామానికి వెల్లి చూసిన చెరువులు నిండు కుండల నీళ్లు ఉండడం అనేది అద్భుతంగా చెప్పుకోవచ్చు, అందుకే ఒక పని జరిగిందంటే దానికదే జరుగదు, ఆకాశం నుండి ఊడిపడదు, ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటేనే ఇలా జరుగుతుందని అన్నారు.65 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించినటువంటి నాయకులు, ఏనాడు కూడా సాగునీరు రంగంలో ఒక మంచి ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నీటి వనరులను రైతులకు అందించాలని గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎడారి భూములకు సాగునీరు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏనాడు ఆలోచించలేదు, మాటలు చెప్పిండ్రు తప్ప, పని జరగలేదు, కాని మన కెసిఆర్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రంగంలో అనేక అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు...ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, కార్యకర్తలు,వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు, రెవిన్యూ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు,సిబ్బంది,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :