సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడగూరు మండల కేంద్రంలో మారుమూల గ్రామాల్లో ఇంటి వద్దకే వైద్య సేవలు అందించి,ప్రతి ఒక్కరిని ఆరోగ్య వంతులుగా తీర్చి దిద్దడమే దుద్దుకుంట పౌండేషన్ లక్ష్యమని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ బొగ్గు సురేష్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు దుద్దు కుంట పౌండెషన్ చైర్మన్ అపర్ణ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు మండల కేంద్రంలో శనివారం చౌడేశ్వరి కల్యాణ మండపంలో మెగా ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయగా,1200 మందికి పైగా వైద్య పరీక్షలతో పాటు మందులు పంపిణీ, ఉచిత వైద్య శిభిరానికి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి తండ్రి మాజీ రెస్కో చైర్మన్ వెంటరామిరెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మెగా ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంభించించారు.ఈ సందర్బంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ బొగ్గు సురేష్ మాట్లాడుతూ....గత పది సంవత్సరాలుగా పుట్టపర్తి నియోజకవర్గంలో దుద్దుకుంట పౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధులతో భాద పడుతున్న దాదాపుగా 56 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.అలాగే కంటి జబ్బులతో దృష్టి లోపించిన దాదాపు 40 వేల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అత్యాధునికంగా రూపొందించిన కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు.దాదాపు ఏడు వేల మందికి బెంగుళూరు,పుట్టపర్తి తదితర సూపస్పెసల్ ఆసుపత్రుల్లో ప్రముఖ కంటి వైద్యు నిపుణుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు చేసి జీవితల్లో(కంటి)వెలుగులు నింపామన్నారు.అంతే కాక నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రభుత్వ కళాశాలలో,పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.వైద్య రంగంలోనే కాక దుద్దుకుంట పౌండేషన్ విద్యా రంగంలో దృష్టి సారించి నిరుపేద విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ తో పాటు ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం తగిన సహాయ సహకారాలు అందించామన్నారు.అలాగే గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద యువ క్రీడాకారులను గుర్తించి నియోజకవర్గంలోని అన్ని మండలాలలోనూ క్రికెట్,వాలీబాల్ తదితర క్రీడ పోటీలు నిర్వహించి ప్రోత్సహం అందిస్తూ....క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అన్ని రంగాల్లోను దుద్దుకుంట పౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.మొదటి రోజు మెగా ఉచిత వైద్య శిభిరానికి వివిధ ప్రాంతాల నుండి దాదాపు వెయ్యి మందిపైగా విచ్చేసిన వారికీ కంటి పరీక్షలతో పాటు అన్ని రకాల వ్యాధులకు అవసరమైన పరీక్షలు చేసి కంటి అద్దాలతో పాటు ఉచితంగా ముందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.మండలలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాధులతో భాద పడుతున్న ప్రజలు మెగా ఉచిత వైద్య శిభిరానికి తరలి వచ్చి సధ్వినియోగం చేసుకోవాలని ఈసందర్బంగా వారు పిలుపునిచ్చారు.ఈ వైద్య శిభిరానికి హాజరైన ప్రజలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసి, సేవలు అందిస్తున్న దుద్దుకుంట పౌండేషన్ చైర్మన్ అపర్ణ రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి,జడ్పీటీసీ కవిత శివశంకర్ రెడ్డి,ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,మండల సచివాలయ కన్వీనర్ జయప్ప,పట్టణ కన్వీనర్ సుధాకర్ రాజు,సింగల్ విండో అధ్యక్షులు బొట్టు స్వామి,సర్పంచ్ లు షబ్బీర్, సురేంద్ర రెడ్డి,రంగారెడ్డి,మోహన్ రెడ్డి,ఆదినారాయణ,ప్రకాష్ రెడ్డి శంకర,ఆదినారాయణ,నరసింహులు,ఎంపీటీసీలు నాగరాజు,సురేంద్ర రెడ్డి,పెద్దప్పయ్య, శ్రీరాములు,డీలర్ల సంఘం అధ్యక్షులు కొండారెడ్డి,వైఎస్సార్ సినియర్ నాయకులు వెంకట్ రెడ్డి,నక్కల చిన్నప్ప, జేసీబీ నరసింహ రెడ్డి,రమణ రెడ్డి,ఉత్తమరెడ్డి,పకీర్ రెడ్డి, ఉత్తప్ప,రమణప్ప తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin