సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండల్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ ఆట త్వరలో ముగుస్తుందని రాబోయేది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమనీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని బండకుంట తండా, పెద్దకుంట తండా నుండి దాదాపు 75 మంది గిరిజనులు మండల పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహ, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా వీళ్ళకుల శంకర్ మాట్లాడుతూ.. నేడు ఏ తండాలో చూసిన అభివృద్ధి లేకుండా గిరిజనులు ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. పేరుకే తాండలను ప్రత్యేక గ్రామపంచాయతీలను చేసీనప్పటికీ అభివృద్ధి శూన్యమని అన్నారు. గిరిజన మహిళలకు ఉపాధి లేదని యువతకు ఉద్యోగాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఏ తండా కూడా సంక్షేమానికి అభివృద్ధికీ నోచుకోలేదని, సంక్షేమం లేదు అభివృద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో తాగునీటికి సమస్య ఉందని, రోడ్డు సరిగ్గా లేవని డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని ఆరోపించారు. పలువురు గిరిజనులు పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
-----------------------
Admin