సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో పోస్టల్ ఉన్నది. ఈ పోస్టల్ కు ఒక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. కానీ కర్ని గ్రామం దురదృష్టం ఏమిటంటే గ్రామ ప్రజలకు ఎలాంటి పత్రాలు వచ్చిన అవి ముఖ్యమైనవి అయినప్పటికీ కూడా తపాల శాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కర్ని గ్రామంలో తపాలా శాఖ ఉన్నది. పోస్టల్ అంటే... స్యయంగా తపాలా శాఖ అధికారే గ్రామ ప్రజల లేఖలను వారి ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వాలి. సబ్ పోస్టల్ అంటే .... ప్రజలే వెళ్లి వాళ్లకు వచ్చిన లేఖలను వారే వెళ్లి తీసుకోవాలని ఉంట్టుంది. కర్ని గ్రామంలో ఉన్నది పోస్టల్ లా లేక సబ్ పోస్టల్ లా అని గ్రామ ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామంలో గ్రామసభ ఉన్న రోజున తపాలా శాఖ అధికారిని హాజరుకావాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వాలి. తపాలా శాఖ అధికారి వారి వారి నివేదికలను గ్రామసభలో సమర్పించాలి. అయితే ఇవేవీ తెలుసుకోకుండా తపాలా శాఖ అధికారి లేఖల మీద కనిపించే ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేసి తన దగ్గరకు రప్పించుకొని లేఖలను అధిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ని గ్రామం మండలం కాక ముందే అన్ని శాఖల అధికారులను వారి వారి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా వారు సమయపాలన సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-----------------------
Admin