సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామగుండం లోని విద్యుత్ ఉత్పత్తి (1×800 MW)కేంద్రాన్ని తెలంగాణ జెన్కో నే నిర్మించాలని డిమాండ్ చేస్తూ TGPE( తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్)JAC సభ్యులు మణుగూరు లోని బీటీపీఎస్ లో గురువారం నిరసన తెలిపారు . ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు ప్రసంగిస్తూ రామగుండం లో మూసివేసిన ఆర్టిఎస్ ( రామగుండం ధర్మల్ స్టేషన్ )స్థానంలో సింగరేణి, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరైన చర్య కాదని విమర్శించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనను చేపట్టినట్లు హెచ్చరించారు. ఆందోళన షెడ్యూల్ ని వివరిస్తూ నేటి నుంచి ఆదివారం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేస్తామని చెప్పారు. అనంతరం ఈ నెల 30 వ తేదీ నుంచి వచ్చే మూడో తేదీ వరకు గేట్ మీటింగ్ లు, చివరన 4,5 వ తేదీ ల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బిటిపిఎస్ బ్రాంచ్ అధ్యక్షులు బి. రవి ప్రసాద్, రవితేజ, సాయి, కార్మిక సంఘ -327 రీజనల్ అధ్యక్షులు బి. కృష్ణ, కార్మిక సంఘం -1535 అధ్యక్షులు వి. ప్రసాద్, సిఐటియు నాయకులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin