Wednesday, 29 July 2026 02:20:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భద్రాచలం పోలీసులు 488 కేజీల నిషేధిత గంజాయిని పట్టివేత ...

Date : 14 February 2023 12:21 AM Views : 811

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పోలీసులు తమ సిబ్బందితో కలిసి భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద నిన్న అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు సిసిఎస్ పోలీసులు మరియు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా. బస్టాండ్ వైపు నుండి భద్రాచలం బ్రిడ్జి వైపుగా వస్తున్న రెండు ఇన్నోవా వాహనాల నుండి పోలీసు వారిని చూసి, ఇద్దరు డ్రైవర్లు వాహనాలను వదిలేసి పారిపోతుండగా, గమనించి వారిని వెంబడించి పట్టుకుని విచారించడం జరిగింది. అనంతరం AP 29 BR 1116 మరియు AP 09 AZ 9868 అను నంబర్లు కలిగిన. అట్టి ఇన్నోవా వాహనాలను తనిఖీ చేయగా సుమారుగా 97,60,000/- రూపాయల విలువ కలిగిన 488 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా, ఒకరు శివకర్ రెడ్డి, S/o వెంకట రెడ్డి, 33 సం.. R/O. తాళ్లగొమ్మురు, సారపాక గ్రామం. మరొకరు నాగేంద్రబాబు, S/o. కృష్ణార్జునరావు, 30 సం., వృత్తి: డ్రైవర్, R/O. మజీద్ కాలనీ, సారపాక అని తమ వివరాలను తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ - ఒడిసా సరిహద్దు పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్ర రాష్ట్రం జహీరాబాద్ కు చెందిన అమీర్ అనే వ్యక్తి కి అమ్మడానికి తరలిస్తున్నట్లు వీరిరువురు అంగీకరించారు. ముఖ్య నిందితుడైన శివశంకర్ రెడ్డి మూడు కేసులలో ఉన్నాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేయడం జరుగుతుంది. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధిత గంజాయిని ఆంధ్రా ఒడిస్సా, సరిహద్దు నుండి కొనుగోలు చేసి అక్రమంగా తరలించి జహీరాబాద్ కు చెందిన అమీర్ మరియు ఆదిత్య కు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో తేలింది. అనంతరం పట్టుబడిన వీరి వద్ద నుండి 228 ప్యాకెట్లలోని 488 కేజీల గంజాయిని, రెండు ఇన్నోవా కార్లను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 18 మంది వ్యక్తులపై పీడీ యాక్టును నమోదు చేయడం జరిగింది అని జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాచలం ASP మరియు సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు 11 కేసులలో 32 మందిని అరెస్టు చేసి 1.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆని యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే గంజాయి అక్రమ రవాణాదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిను అక్రమంగా తరలించాలని చూసినా, వారికి ఆర్థికంగా సహకరించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.తమ పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లుగా తెలిస్తే పోలీసువారికి సమాచారం ఇస్తే వారికి సాధారణ కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దిశా నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది ఆని పోలీసులు తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :