Wednesday, 29 July 2026 05:16:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి...

Date : 24 August 2024 12:47 PM Views : 293

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : విద్యారంగ సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 100 ఫీట్ల రోడ్డు నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడు తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అదే విధంగా పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు దీయింబర్స్మెంట్ సుమారు రూ.8300 కోట్లు బకాయిలు గా ఉన్నాయని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఏర్పాటు చేయాలి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ,యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి, అని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఉన్న స్కాలర్షిప్. ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు కాలేజీ విద్యార్థులు, మమత, సంధ్య, నవ్య, శైలజ, వనజ, శివ, సందీప్,మహేష్,నవీను,వినయ్, వేణు,సాయిరాం, ఉదయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :