Wednesday, 29 July 2026 03:37:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చించోడు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించిన వైద్యాధికారి... -డాక్టర్ స్రవంతి.

Date : 18 May 2023 02:27 AM Views : 526

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల్ చించోడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏరియాలోని సబ్ సెంటర్ "ఏ" అర్బన్ లో సంజయ్ కాలనీ, కసబ్ వాడ ఏరియాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు వైద్య అధికారి డాక్టర్ స్రవంతి, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశలతో కలసి, గర్భవతులను ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేయించడంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అర్బన్ ఏరియాలో చాలామంది గర్భము వచ్చిన తరువాత కూడా ఆరోగ్య సిబ్బందికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని గుర్తించి, డాక్టర్ స్రవంతి వారి ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో డాక్టర్ స్రవంతి కొత్తగా పెళ్లి అయిన స్త్రీలతో, మొదటి కాన్పు అయ్యి నా వారితో, కుటుంబ నియంత్రణ పాటించని వారితో పర్సనల్గా మాట్లాడి, వారి ఆరోగ్యం నకు సంబంధించిన విషయాలు, ఆ స్త్రీలతో చర్చించి, వారికి కావలసిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎవరైతే మొదటి కాన్పు అయిన వారికి మరియు కొత్తగా పెళ్లి అయ్యి ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వారికి, కుటుంబ నియంత్రణ పద్ధతిలో, తాత్కాలిక పద్ధతుల గురించి వారికి వివరంగా తెలియజేశారు. తాత్కాలిక పద్ధతులలో కాపర్ టీని, లుప్, గర్భ నిరోధక మాత్రలు, కండోము, అంతర ఇంజక్షన్ ను తీసుకొని గర్భమునకు, మరి ఒక గర్భమునకు వ్యవధి మూడు సంవత్సరములు వెవదని పాటించాలి అని తెలియజేశారు. ఈరోజు ఇంటింటి సర్వేలో మొత్తం ఐదు కొత్త గర్భవతులను గుర్తించడం జరిగిందని డాక్టర్ స్రవంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, ఏఎన్ఎంలు ఇస్తేర్ రాణి, విజయలక్ష్మి, ఆశలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :