Thursday, 30 July 2026 08:26:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో రెండవ ఏన్‌ఎంలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ...

Date : 01 June 2023 08:48 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏన్‌ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుదవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్రములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ ఏఎన్‌ఎంల రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు డి. అరుణ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డి అరుణ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయమని ఖరాకండిగా చెప్పడం బాధాకరమని అన్నారు. మంత్రి హరీష్ రావు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 16 ఏళ్లుగా రెండవ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తూ అన్ని జాతీయ ఆరోగ్య కార్య క్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నా మని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తక్షణమే రెగ్యులరైజ్‌ చేసి తమకు ఉద్యోగ భధ్రత కల్పించాలన్నారు. సమాన పనికి సమానం వేతనంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 16 నంబర్ జీవోలో చేర్చి బేసిక్ ఇవ్వాలని కోరారు. 7 సంవత్సరాల ఏరియర్స్ ఇవ్వాలని కోరారు. ఏలాంటి రాత పరీక్షలు లేకుండా ఉన్న స్థానంలోని పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అరుణ,చంద్రకళ,సరళ, అరుణ సులోచన, జోతి, స్వాతి, సునీత, తిరుపతమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :