సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్సీ నిలాయి నాయక్ నేరేడుచర్ల మండలంలో విస్తృత పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా నేరేడుచర్ల మండలంలోని అతి పురాతనమైన సోమప్ప దేవాలయాన్ని దర్శించుకుని దేవాలయ యొక్క చరిత్రని తెలుసుకున్నారు.అనంతరం గిరిజన కార్యకర్తలను కలిసి నేరేడుచర్ల మండల కార్యాలయంలో నేరేడుచర్ల మండల, పట్టణ,పాలకవీడు మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయ్ కుమార్ సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, గుండ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు, వారితో పాటు జిల్లా అధ్యక్షులు బొబ్బ బాగ్యరెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి జితేందర్ గుప్తా పాల్గొని వారు మాట్లాడుతూ రాబోయే క్ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని రాబోయేది డబల్ ఇంజన్ సర్కార్ అని అన్నారు. అనంతరం సాయంత్రం దిర్షించర్ల గ్రామంలోని సమ భావన సంఘాల మహిళలతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు కోనతం లచ్చి రెడ్డి,మండల నాయకులు బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
-----------------------
Admin