సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : యంబీబీఎస్ సీటు సాధించిన పోలీసు పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించి అభినందించారు కొద్ది రోజుల క్రితం యంబీబీఎస్ మొదట పెడతా కౌన్సిలింగ్లో సెంట్రల్ జోన్ షేక్ సలీమా కుమార్తె తాన్య సభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా హోంగార్డ్ బాలకృష్ణ కుమారుడు ముప్ప చందు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు మరో హోంగార్డ్ మోహన్ కుమార్తె భవాని అసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్న పిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సహించాలని తమ పిల్లలు యం బిబిఎస్ సీటు సాధించడంలో కృషిచేసిన తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్ ప్రభాకర్ రావు ఎసిపి నాగయ్య ఆర్ఐ చంద్రశేఖర్ తో హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
-----------------------
Reporter