సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలంలోని ఏల్లాపురంలో 200మంది బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక రాష్ట్రంలో 9 సంవత్సరాల కేసీఆర్ దరిద్రపు పాలనకు చరమగీతం పాడాలని,నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్ని వర్గాల ప్రజలను దోపిడీ చేస్తున్నారని, పేదల భూములు గుంజుకుంటున్నారని, ఇసుక, వైన్స్, మైన్స్ మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని ఎల్లాపురం గ్రామంలో ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తీగల శేసిరెడ్డి, మరో 200 మంది ఎంపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తాము తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో తాము ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, పాలకీడు మండలంలో ఒక్క ఇంటిని ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ముస్లిం ఈద్ ప్రహరి గోడకు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతుల అవసరార్థం మూసీ నదికి లిఫ్ట్,కమ్యూనిటీ హాలు నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, మండలపార్టీ అధ్యక్షుడు సుబ్బారావు,వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి,జడ్పిటిసి బుజ్జి మోతిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సప్పిడినాగిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మీసాలఉపేందర్, అందే రాజు, బెల్లంకొండ నరసింహారావు, గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్,భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin