Sunday, 13 September 2026 11:47:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కాస్తా... ఎమర్జెన్సీ ఎంట్రీగా మారింది...

Date : 09 January 2024 09:49 AM Views : 330

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : సాధారణంగా పండుగల సమయంలో బస్సులు, రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. ఇలాంటి సమయంలో టికెట్‌ దొరకడమంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఇక టికెట్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్‌ బోగీల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వారి అవస్థలు గురించి చెప్పాల్సిన పనిలేదు. కిక్కిరిసిన జనంతో రైలు ఎక్కడమే కష్టమనుకుంటే మరోవైపు సీటుకోసం పోటీపడేవారి సంగతి చెప్పనక్కర్లేదు. కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌లూ ఏవీ వదలరు. ఏ చిన్న అవకాశం దొరికినా రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాదు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. కిక్కిరిసిన జనంతో హైదరాబాదు రైల్వే స్టేషన్‌ జనసంద్రాన్ని తలపించింది. రైల్లోనే కాదు, ప్లాట్‌ఫాం పైన కూడా అడుగుపెట్టేందుకు సందులేనంతగా జనాలు చేరుకున్నారు. ఇక రైలు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో ఓ యువతి ఎమర్జెన్సీ విండో ఓపెన్‌ చేసి అందులోంచి రైల్లోకి ప్రవేశించింది. మరో మహిళ కూడా ఆమెను అనుసరించింది. చీరకట్టులో ఉన్న ఆ మహిళ అలా రైలు ఎక్కడం పెద్ద సాహసమే అనుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వినియోగదారు ఈ వీడియోను ఎక్స్‌ ఖాతీలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. అతి చిన్న డోర్‌నుంచి చీర కట్టుకుని కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కడం గొప్ప ఫీట్‌ అని ఒకరు, విండోస్‌ ట్రైనింగ్‌ అని ఇంకొకరు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ని ఎమర్జెన్సీ ఎంట్రన్స్‌గా మార్చారు అంటూ మరొకరు రకరకాలుగా కామెంట్లతో హోరెత్తించారు.... సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో వేలాది మంది యాత్రికులు ఇలా రైల్వేస్టేషన్‌కు పోటెత్తారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: